J.SURENDER KUMAR,
ప్రమాదాలలో గాయపడిన, అనారోగ్యం బారిన పడిన వారి ప్రాణాలను కాపాడడానికి వైద్య సేవలు అందించేది గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపి , పిఎంపి వైద్యులేనని ధర్మపురి ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి మండల కమ్యూనిటీ పారామెడిక్స్ RMP &PMP వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కేంద్రంలో వారి సంఘ భవనంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ఖరీదైన వైద్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రిలోకి వెళ్లి వైద్యం చేయించుకున్న, ప్రాథమికంగా వారి ప్రాణాలు కాపాడడం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ, పిఎంపి వైద్యులే అని అన్నారు.
ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించి ఆర్ఎంపీ ఎంపీ వైద్యులకు వైద్య పరమైన శిక్షణ ఇప్పించి వారికి ఓ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. అధ్యక్ష కార్యదర్శులను, కార్యవర్గాన్ని సన్మానించి ఎమ్మెల్యే అభినందించారు.