J.SURENDER KUMAR,
మన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటామని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పరిశీలకులు కత్తి వెంకటస్వామి మరియు వైద్యుల అంజన్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలకు నూతన అధ్యక్షులు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు ఆసక్తి గల వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..

పార్టీ బలోపేతంగా ఉంటేనే మనం బలంగా ఉంటామని, గ్రామ స్థాయి మండల స్థాయి అధ్యక్షులుగా ఎవరు పోటీ చేయాలనుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, దాని ప్రకారం పరిశీలకులు వారి వివరాలు సేకరించి, అధిష్టానం సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, అన్నారు.
ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో పార్టీకి అన్ని తెలుసునని, స్థానిక ఎన్నికలలో పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలు నాయకులు కష్టపడాలని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి అందరూ కట్టుబడి ఉండాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.