ఆర్డీవో గారు – మీరు నేనే ఇల్లు కట్టిద్దాం మంత్రి లక్ష్మణ్ కుమార్!

👉 దివ్యాంగుని దీనస్థితి చూసి చలించి మంత్రి
అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ ఫోన్ లో ఆర్డీవో తో !

J. SURENDER KUMAR,

” ఆర్డీవో గారు అతడు (దివ్యాంగుడు) ఏమి చేసుకోడు, మీరు, నేను కలసి  ఇల్లు కట్టిద్దాం, ఇందిరమ్మ ఇంటి మంజూరులో  నాట్ సాంక్షన్ ఉన్న లిస్టులో ఇతడి పేరున ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయండి. అవసరమనుకుంటే హౌసింగ్ బోర్డ్  ఎండి తో మాట్లాడుతాను ” అంటూ  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ  మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఆర్డిఓ కు ఫోన్ చేసి ఆదేశించారు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి !


ఎండపల్లి మండల కేంద్రంలో ఆదివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ తదితర అభివృద్ధి కార్యక్రమాల లో భాగంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగుడు కొమురయ్యతో మాట్లాడుతున్న మంత్రి !

గొల్లపల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ఏ. కొమురయ్య, నడవలేని స్థితిలో  ఉన్న దివ్యాంగుడు తన ఇబ్బందులు వివరించడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కలవడానికి వచ్చాడు.
కొమురయ్య  దివ్యాంగ దుస్థితి చూసి చలించిన మంత్రి , అతడి వద్దకు వెళ్లి కొమురయ్య ను ఓదార్చి, నీకు అన్ని ప్రభుత్వం చేస్తుంది. అంటూ అతని సమక్షంలో ఫోన్ లో ఆర్ డి ఓ తో మాట్లాడారు
.

సోమవారం ఎమ్మార్వో ఆత్మకూరు గ్రామానికి వెళ్లి స్థల పరిశీలన చేయాలి, కొమురయ్య ఏమి చేసుకోలేడు. మనమే ఇల్లు కట్టించి ఇద్దాం. అలానే దివ్యాంగ శాఖ పిడి నరేష్, ద్వారా కెనెటిక్ సైకిల్
ఇద్దాం, పెగడపల్లి మండలం మద్దులపల్లె కు చెందిన గణేష్ కు సైతం శనివారం ఇద్దాం అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆర్డిఓకు సూచించారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్  స్పందించిన తీరును
ప్రజలు ప్రశంసిస్తున్నారు.