J.SURENDER KUMAR,
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం ధర్మపురి నియోజకవర్గానికి రానున్నారు. ఆదివారం క్యాబినెట్ మంత్రిగా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే,
సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహ తదితరు మంత్రులను వారి నివాసాలకు వెళ్లి మంత్రి లక్ష్మణ్ కుమార్ కలిశారు.
తన మొదటి అధికారిక మంత్రి పర్యటన లో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి, రానున్నారు.
కాంగ్రెస్ శ్రేణులను, అభిమానులను, నియోజకవర్గ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ రానున్నారు.
👉 మంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు రానున్నారు.
👉 పత్తిపాక x రోడ్ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు.
👉 రాజారాంపల్లె, వెల్గటూర్, రాయపట్నం మీదుగా ధర్మపురికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
👉 ధర్మపురి పట్టణంలోని SH గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు.