రుద్రoగి కమలకు కళాశ్రీ పురస్కారం!

J.SURENDER KUMAR,

జగిత్యాలకు చెందిన కవయిత్రి రుద్రoగి కమలను కళాశ్రీ పురస్కారంతో సత్కరించటం అభినందనీయమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు అన్నారు.
వర్ధమాన కవులు, కవియిత్రులను ప్రోత్సాహించే దిశగా ముందుకు వచ్చిన కార్యక్రమమే కవి ఇంటికి అని గుండేటి రాజు అన్నారు.

కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం జగిత్యాల అద్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కవితా గానం అలరించింది. ప్రతి నెల వర్ధమాన కవులను వెలుగులోకి తీసుకొనే కార్యక్రమంగా ముందుకు వెళుతామని కళాశ్రీ అధినేత గుండేటి రాజు అన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అయిత అనిత, మద్దెల సరోజన, కొరిడే రమాదేవి, కటుకం కవిత, లక్కారాజు శ్రీలక్ష్మి, ములస్తం లావణ్య, రుద్రoగి రాధా, రుద్రాంగి రమాదేవి, ముత్యం భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్యామ్ సుందర్, ఓదెలా గంగాధర్, రుద్ర మాణిక్యం, మద్దెల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.