👉 జగిత్యాల జిల్లా అవోప ఆధ్వర్యంలో..
J.SURENDER KUMAR,
రైలు ప్రమాద బారిన పడిన నిరుపేద ఆర్యవైశ్యుడు ముత్యపు అభిలాష్ కు జగిత్యాల జిల్లా అవోప అధ్యక్షుడు రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల నుండి సేకరించిన నగదు ఆర్థిక సహాయం డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ జగిత్యాల కార్యాలయంలో C I ఆరిఫ్ అలీ ఖాన్ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామం కు చెందిన నిరుపేద ఆర్యవైశ్యుడు ముత్యపు అభిలాష్ రైల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆర్థిక సహాయం అందించాలని. అతని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వాసవి సేవా దళ్ జగిత్యాల మూడు గ్రూపు ల ద్వారా దాతలు ఫోన్ పే ద్వారా సేకరించిన మొత్తం వారి తమ్ముడు అజయ్ కుమార్ కు ₹ 63,639/- రూపాయల అందించారు.
ఈ సందర్భంగా జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ సేవలు అభినందనీయమని సిఐ ఆరిఫ్ అలీ ఖాన్, పలువురు ఆర్యవైశ్య నాయకులు, సేవల తీరును ప్రశంసించారు.