సామాజిక న్యాయ పోరాట యోధుడు రాహుల్ గాంధీ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు , రాహుల్ గాంధీ, సామాజిక న్యాయ పోరాట యోధుడని ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిఅడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్  గాంధీభవన్ లో గురువారంఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలో  బీసీ సంక్షేమ శాఖ మంత్రి   పొన్నం ప్రభాకర్ , రాజ్యసభ సభ్యుడు  యాదవ్ తో కలిసి వేడుకల్లో పాల్గొని మంత్రి లక్ష్మణ్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాట్లాడుతూ.. కులగణ సర్వే, ఎస్సీ వర్గీకరణ బిల్లు  రైతు రుణమాఫీ, తదితర పేదల సంక్షేమ పథకాల విజన్ గల నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జూడో నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల అభిమానం చూడకుండా నాయకుడు రాహుల్ గాంధీ అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

👉 శాసనసభాపతిని ప్రసాద్ కుమార్ ను కలిసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

రాష్ట్ర శాసనసభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ ను హైదరాబాద్ లో ఆయన అధికార నివాసంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
ఈ సందర్భంగా శాసనసభాపతి మంత్రి లక్ష్మణ్ కుమార్ ను శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

శాసనసభాపతితో పాటు  బీసీ సంక్షేమ &రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి లక్ష్మణ్ కుమార్  మర్యాద పూర్వకంగా కలిశారు.