👉 కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూల విక్రయం !
J.SURENDER KUMAR,
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనగోలుకు టీటీడీ నూతన సౌలభ్యాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.
తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు కోసం కియోస్క్ ( యంత్రాలు ) అందుబాటులో ఉంచింది.ఈ సౌలభ్యం ద్వారా భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ కొనసాగేలా అవకాశం కనిపించింది.
యూపీఐ చెల్లింపు లేకుండా సదుపాయం ద్వారా నగదు పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.
👉 కియోస్క్ యంత్రాల ద్వారా లడ్డూలు పొందే విధానం !

భక్తులు లడ్డూ పంపిణీ కౌంటర్లకు సమీపంలో ఏర్పాటు చేసిన కియోస్క్ యంత్రం వద్దకు వెళ్తారు.
యంత్రంలో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి:
👉 1. దర్శన టికెట్ ఉన్నవారు
👉 2. దర్శన టికెట్ లేనివారు
👉 దర్శన టికెట్ ఉన్నవారు:
ఈ ఆప్షన్ ఎంచుకోండి.
టికెట్ వివరాలను ధృవీకరిస్తుంది.
టికెట్‌లో ఉన్న వ్యక్తుల సంఖ్య ఆధారంగా ప్రతి వ్యక్తికి రెండు అదనపు లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
👉 దర్శన టికెట్ లేనివారు:
ఈ ఆప్షన్ ఎంచుకుని సరైన(వెరిఫైడ్) ఆధార్ నంబర్ ఇవ్వాలి.
ఈ మార్గం ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 2 లడ్డూల వరకు కొనుగోలు చేయవచ్చు.
సరైన ఎంపిక తర్వాత యూపీ ద్వారా చెల్లింపు చేయాల్సిన పేజీకి వెళ్లి లావాదేవీలు చేయవచ్చు.
చెల్లింపు అనంతరం ముద్రిత రసీదు వస్తుంది
ఆ రసీదుతో లడ్డూ కౌంటర్ల వద్దకు వెళ్లి అదనపు లడ్డూలు పొందవచ్చు.
భక్తుల సౌకర్యార్థం టిటిడి ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి విశేష స్పందన లభిస్తోంది.