సొంత ఇల్లు లేక స్మశానవాటిక లో చివరి శ్వాస పై !

J.SURENDER KUMAR,


మానవ సమాజంలో  కఠినాత్ములకైన కన్నీళ్లు తెప్పించే హృదయ విధారకమైన సంఘటన శుక్రవారం రాత్రి ధర్మపురి పట్టణ స్మశాన వాటికలో చోటుచేసుకుంది.


👉 వివరాలు ఇలా ఉన్నాయి !


ధర్మపురి పట్టణం నంది చౌక్ వద్ద గత కొన్ని సంవత్సరాల నుండి  టిఫిన్ బండి నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్న గోపికి సొంత ఇల్లు లేక శుక్రవారం స్మశాన వాటికలో చివరి శ్వాస
తో కొట్టుమిట్టాడుతున్నాడు.


మృతుడు గోపి గత కొంతకాలంగా  అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడు.  వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ  తిరిగినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు.


వైద్యులు  గోపి బతకడం కష్టం తీసుకు వెళ్ళండి అంటూ కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు.  కొన ఊపిరితో ఉన్న అతన్ని  కిరాయి ఉంటున్న ఇంట్లోకి తరలిస్తుండగా, ఇంటి యజమానులు అంగీకరించలేదు.


నిలువ నీడ లేక విధి లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు స్థానిక స్మశాన వాటికలోకి తెచ్చిన గోపి
ఉన్నాడు


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆర్థిక సహాయం !


సమాచారం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, పట్టణంలోని  తమ నాయకులు, కార్యకర్తలు ద్వారా తాత్కాలికంగా ₹ 10 వేల రూపాయల ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందించారు.