👉 మేళ తాళాలు పూర్ణకుంభ స్వాగతాలు వద్దు !
J.SURENDER KUMAR,
నేను ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముందు సామాన్య భక్తుడిని, నాకు ప్రోటోకాల్ అంటూ మేళ తాళాలు, పూర్ణకుంభ స్వాగతాలు ఇవ్వకండి. ధర్మపురి నా నియోజకవర్గం స్వామి సన్నిధిలో అలాంటివి వద్దు అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆలయ అధికారులను ఆదేశించారు.
శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి మంత్రి వచ్చిన సందర్భంగా పూర్ణకుంభ స్వాగత ఏర్పాట్లు యత్నంలో ఆలయ అధికారులు ఉండగా మంత్రి పై విధంగా అన్నారు.

సామాన్య భక్తుడిలా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని, శివాలయ ప్రాంగణంలో ఈశాన్య గణపతి ఆలయంలో జరిగిన సంకష్ట చతుర్థి పూజలో మంత్రి లక్ష్మణ్ కుమార్ సామాన్య భక్తుడిగా నేలపై కూర్చున్నారు.
ధర్మపురి నా నియోజకవర్గ శ్రీలక్ష్మీనరసింహస్వామి నా దైవం అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యానాలను భక్తులు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.