👉 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన డాక్టర్ వివేక్ లక్ష్మణ్ కుమార్ , శ్రీహరి లు పాల్గొన్నారు.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు.

👉 రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్ అలైన్‌మెంట్‌కి కేబినెట్ ఆమోదం..
👉 రేపు సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా రైతు నేస్తం సభ..
👉 కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై సుదీర్ఘ చర్చ..
పీసీ ఘోష్ కమిషన్‌కు ఈ నెల 30లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం !
👉 క్రీడా పాలసీని కేబినెట్ ఆమోదించింది..
👉 సంగారెడ్డి జిల్లాలో 2 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు..
👉 9 రోజుల్లో ₹ 9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం..
👉 బనకచర్లపై చట్టపరంగా, న్యాయపరంగా ముందుకెళ్తాం..
👉 గోదావరి జిలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటిని వదులుకునేది లేదు..
👉 చౌటుప్పల్ – సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల RRRకు ఆమోదం !
👉 ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేయాలని తీర్మానం!