తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తజనం !

👉 శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న దాదాపు లక్ష మంది భక్తులు !

👉 మే మాసంలో కోటి మంది భక్తులకు అన్న ప్రసాదాల వితరణ !


J.SURENDER KUMAR,


దాదాపు దశాబ్ద కాలం తరువాత తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో ఆదివారం (దాదాపు లక్ష మంది )  95,080 మంది భక్తులు  స్వామివారిని దర్శించుకున్నారు.


మే 16 నుండి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా అహర్నిశలు విధులు నిర్వహించి, గత రెండు వారాల్లోని గురువారాలు, శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది.


గతేడాది మే నెలతో పోల్చితే, ఈసారి 55,759 మంది అధికంగా దర్శించుకున్నారు.


👉 2024 మేలో 23,23,493 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 2025 మేలో 23,79,252 మంది భక్తులు దర్శించుకున్నారు.


👉 అలాగే, అన్నప్రసాద వితరణలో కూడా ఈ ఏడాది నూతన రికార్డు నమోదైంది. 2024 మేలో 71 లక్షల వితరణలు జరిగితే, ఈ సంవత్సరం 2025 మేలో 1.33 కోట్ల వితరణలు నమోదు కావడం విశేషం.


ఇంతేకాకుండా, ఈ మే నెలలో తలనీలాల సంఖ్య, లడ్డూ విక్రయాల పరంగా కూడా గత ఏడాది మేతో పోల్చితే అధికంగా నమోదు కావడం గమనార్హం.