తిరుమల శ్రీవారి దర్శనంకు మంత్రి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్ర మంత్రి గా ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మంగళవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంకు కాలినడకన ఏడుకొండలు ఎక్కుతున్నారు.

తమ ఇంటి ఇలవేల్పు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నీ మంత్రి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. మంగళవారం తిరుపతి చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుండి కాలినడకన బయలుదేరారు.