👉 మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ
అధికార ప్రతినిధి జగన్ !
J.SURENDER KUMAR,
టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ U, వాంకిడి, జైనూర్, కెరమేరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్ నగర్, నార్నూర్, సిర్పూర్ (T), చింతల మానపల్లి, గాజుగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికలపేట మండలాల ప్రజలను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న అన్ని రకాల ప్రయత్నాలను విరమించుకోవాలని టైగర్ ఫారెస్ట్ కారిడార్ వద్దు – జీవో 49 ని రద్దు చేయండి అని (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ అధికార ప్రతినిధి, ప్రకటనలో డిమాండ్
చేశారు.
ఆదివాసి ప్రజల హక్కుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించి అమరజీవిగా ఆదివాసుల ఉద్యమ స్ఫూర్తిగా ఉన్న కొంరంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీ.వో. నెం. 49 తేదీ. 05.05.2025ని రద్దు చేయాలని,
ఈ జీవో ఉద్దేశ్యం జంతుపులుల కోసం కాదు అనేది వాస్తవం. ఇది మానవ పులులైన మోడీ, అమిత్ షా మానసపుత్రులైన అదాని, అంబాని మరియు కార్పోరేట్ సంస్థల కోసమే అనేది అందరూ గమనించాలి ప్రకటనలో పేర్కొన్నారు.

ముఖ్యంగా అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలలో 3 జిల్లాలు పూర్తిగా కనుమరుగవుతాయి. కొమరంభీం జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో ఇక కనపడవు ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల్లో సుమారు 10 నియోజకవర్గాలు రానున్న రోజుల్లో వాటి ఊసే ఉండదు. ప్రకటనలో వివరించారు.
భారత రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను, సంపదను దొంగిలించడానికి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఇందుకోసం జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఈ దేశ మూలవాసులైన ఆదివాసులను అడవి నుండి వెల్లగొట్టడానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చిత్ర హింసలకు గురిచేస్తూ చంపుతున్నారని పేర్కొన్నారు.
👉 డిమాండ్స్
👉 సంఘాలతో చర్చించి వారు అడుగుతున్న న్యాయ సమ్మతమైన, రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన డిమాండ్లను తప్పక వెంటనే పరిష్కరించాలి.
👉 ములుగు జిల్లాలోని ఆదివాసి ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రజలను అరెస్టులతో, కేసుల బెదిరింపులతో గూడాలను ఖాళీ చేయించడానికి రాజ్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
👉 ఆదివాసి బిడ్డ, మాజీ నక్సలైట్గా ప్రాచుర్యంలో ఉన్న సీతక్క సొంత నియోజక వర్గంలో ఈ విదంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న దనసరి అనసూయ గారు ఎందుకు ఆదివాసుల గురించి మాట్లాడడంలేదు అనేది అందరు మాట్లాడుకుంటున్నారు అని మావోయిస్టు పార్టీ ప్రకటనలో పేర్కొంది.