వేములవాడ శ్రీ రాజన్న సన్నిధిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని
ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆదివారం రాత్రి చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ, ఆలయ కార్య నిర్వహణ అధికారి, ఘనంగా స్వాగతించారు.

ఆదివారం రాత్రి వేములవాడ లోప్ బస చేసిన మంత్రి సోమవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం  కోడే  మొక్కు క్షమించుకున్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘనంగా ఆశీర్వదించి శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని బహుకరించారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారితో కలిసి దర్శించుకొన్నారు.

సందర్భంగా కోడె మొక్కుల చెల్లించి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేసి శాలువాతో సన్మానించారు.