J.SURENDER KUMAR,
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేసే విద్యార్థి దత్తత కార్యక్రమం అభినందనీయం ఆదర్శ ప్రాయం అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాతలు మరియు విద్యాభిమానుల సహకారంతో శనివారం ఏర్పాటు చేసిన స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు అందించే విద్యార్థి దత్తత కార్యక్రమం ఈ సంవత్సరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కన్వీనర్. డా. గొల్లపల్లి గణేశ్ ఆధ్వర్యంలో నిర్వహించడం దాదాపు ₹ 3 లక్షలు విలువగల బ్యాగులను నిరుపేద 650 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం ప్రశంసనీయమని కన్వీనర్ డాక్టర్ గొల్లపల్లి గణేష్ ను, ఎన్నారై లను మిత్ర బృందాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.

ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్ అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా జగిత్యాల జిల్లా విద్యాధికారి కే రాము , ధర్మపురి మండల విద్యాధికారిని శ్రీమతి సీతాలక్ష్మి, బీర్పూర్ మండల విద్యాధికారి నాగభూషణం, గొల్లపల్లి మండల విద్యాధికారి శ్రీమతి జమున దేవి, సెక్టోరియల్ ఆఫీసర్ మహేష్, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు ఆనందరావు, అమర్నాథ్ రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దాతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు బ్యాగులు అందించిన దాతలను, కార్యక్రమ కన్వీనర్ డా గొల్లపెల్లి గణేశ్ ను వక్తలు అభినందించారు.