J.SURENDER KUMAR,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం బాధ్యతలు చేపట్టిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థుల సంక్షేమంకు సంబంధిత ఫైల్ పై తన మొదటి సంతకం చేశారు.
రాష్ట్రంలోని 841 మంది దివ్యాంగుల స్వయం ఉపాధికి ₹ 5 కోటు నిధులు మంజూరుకు అనుమతులు ఇచ్చారు.
గిరిజన విద్యార్థుల విదేశీ విద్య విద్యార్థుల సంఖ్యకు ఏటా 108 నుంచి 300కు పెంచేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
మైనార్టీల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని, సంక్షేమ కార్పొరే షన్లకు నిధులు మంజూరుచేసి సంక్షేము పథకాలు అమలు చేయనున్నట్టు తెలిపారు.
👉 ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకోసం డాక్టర్ బీఐర్ అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద 2005-28 ఏడాది నుంచి విద్యార్థుల సంఖ్యను 200 నుంచి 500కు పెంచేందుకు ఆర్థికశాఖ అనుమతులు కోసం ఫైలు సిఫారసు చేశారు.
👉 రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సంఘాలు ఏర్పాటుచేసి, తవ నోపాధికి యూనిట్ల ఏర్పా టుకు రివాల్వింగ్ ఫండ్ ₹ 3.55 కోట్లు మంజూరు చేశారు. ఈ నిర్ణయంతో 2367 సంఘాలు లబ్ది పొందనున్నాయి.
👉 ఎస్టీ గురుకుల సొసైటీ, సంక్షేమశాఖ పరిధిలో గిరిజన విద్యాలయాల మరమ్మతులకు ₹ 79.81 కోట్లు మంజూరు చేస్తూ అనుమతి ఇచ్చారు.
👉 రాష్ట్రంలో 29 మినీ గురుకులాల నిర్వహణ కోసం ₹.17.18 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతులు ఇచ్చారు.
👉 అసంపూర్తి మేడారం జాతర మిగిలిన పనులు పూర్తి చేయడానికి ₹ 44.5 కోట్లు మంజూరుకు అనుమతించారు.