J SURENDER KUMAR,
హైదరాబాద్ లోని గౌలిదొడ్డి రెసిడెన్సీలోనీ సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భోజనం చేశారు.

శనివారం హైదరాబాద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ,ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నేరుగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ కి వెళ్లి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బాధ్యతలు స్వీకార కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ,రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వాకటి శ్రీహరి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ , జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, తో సహా పలువురు ఎమ్మెల్యేలు మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కలిసి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరణ కు ముందు మంత్రి లక్ష్మణ్ కుమార్ అంబేడ్కర్ , మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించరు.