👉 కెమెరాలకు ప్రత్యేక పూజలు !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ కెమెరా దినోత్సవం వినూత్నంగా నిర్వహించారు.
ప్రపంచ ఛాయాచిత్రకారుల సంక్షేమర్థం లోకకళ్యాణార్థం ఛాయాచిత్ర యంత్ర దేవత పూజలను ఘనంగా నిర్వహించారు. ధర్మపురి శ్రీ ఆయ్యప్ప స్వామీ ఆలయం మడపంలో అర్చకుడు గుండి అశ్విన్ శర్మ వేదమంత్రోచ్చరణల మధ్య కెమెరాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు .
అనంతరం ఛాయాచిత్ర యంత్ర దేవత చిత్రపటం ముందు కెమెరాలు ఉంచి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ధర్మపురికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్ స్వయంగా మట్టితో ఛాయాచిత్ర యంత్ర దేవత , విగ్రహమును తయారు చేసుకుని కెమెరా పరిభాషలో కెమెరాకు మట్టి ఛాయాచిత్ర యంత్ర దేవి విగ్రహం కు ప్రత్యేక అర్చనలు ధూప దీప నివేదన మంగళహారతి మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు.

ఆషాడంలో ప్రజలు గ్రామం చల్లగా ఉండాలని పొలిమేర దేవతలను బోనాలతో పూజిస్తారు. ధర్మపురి ఫోటోగ్రాఫర్లు ప్రపంచ ఫోటోగ్రాఫర్లు సంక్షేమం కొరకు గత ఐదు సంవత్సరాలుగా ఛాయాచిత్ర యంత్ర దేవత పూజలను నిర్వహించడం విశేషం.