వివాదాలు వద్దు రాజీ మార్గమే ముద్దు జడ్జ్  యోగి జానకి !

👉 ధర్మపురి లోక్ అథాలత్  లో 278 కేసులు పరిష్కారం !

J.SURENDER KUMAR,

ఎవరికైనా. ఏదైనా వివాదాలు, సమస్యలు కలిగినప్పుడు కోపద్వేషాలకి పోకుండా కూర్చొని మాట్లాడుకోవాలని వివాదాలు వద్దు రాజీ మార్గమే ముద్దు అని ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జ్  యేగి జానకి  అన్నారు.

ధర్మపురి న్యాయస్థాన జూనియర్ సివిల్ జడ్జ్  ఆధ్వర్యంలో  శనివారం జరిగిన లోక్ అథాలత్ లో 278 వివాదాలు రాజి కుదుర్చుకొని ఇరు వర్గాలు పరిష్కరించుకున్నారు.

ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి యేగి జానకి  మాట్లాడుతూ

కేసుల వలన మంచి భవిష్యత్తు కోల్పోతారని ఎవరు కూడా గొడవలకు వివాదాలకు పోకుండా ఉండాలని, కేసులు  ఉన్న ఇరు పార్టీలు రాజీ కావాడం వలన ఇరువురు గెలిచినవారు అవుతారు కావున  రాజీ మార్గమే రాజ మార్గము అని అన్నారు.


ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అలుక వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు బందెల రమేష్, ట్రెజరరీ జాజాల రమేష్, జాయింట్ సెక్రెటరీ గూడ జితేందర్ రెడ్డి, ఏ జి పి ఇమ్మడి శ్రీనివాస్, సినియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, రౌతు రాజేష్, రామడుగు రాజేష్ , కస్తూరి శరత్ మరియు ఇతర న్యాయవాదులు, పోలిస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.