వైభవంగా స్వతంత్ర టీవీ వార్షికోత్సవం పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

స్వతంత్ర టీవీ మూడవ వార్షికోత్సవం గురువారం
హైదరాబాద్ బేగంపేట లోని టూరిజంప్లాజా లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,AICC మాజీ కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

👉 సమీక్ష సమావేశం :

ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గురువారం సోషల్ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్  సచివాలయం తన ఛాంబర్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ అలుగు వర్షిణి మరియు  అధికారుల తో  ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సంబంధిత ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులకు అందుతున్న  సంక్షేమం పథకాలు, సమస్యలు, పెండింగ్ అంశాలు, యుద్ధ ప్రాతిపదికను తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ చర్చించారు.


శాఖల వారీగా సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.