అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలో ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులను ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు.

శ్రావణమాసం సందర్భంగా ముందుగా మంత్రి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేసి శాలువాతో సన్మానించారు.

అనంతరం ₹12 లక్షల  SDF  నిధులతో నిర్మించిన నాగమయ్య దేవాలయాన్ని, మరియు ₹ 15 లక్షల వ్యయంతో నిర్మించిన పుట్ట బంగారం మండపాన్ని, ₹ 1  కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన KNR షాపింగ్ కాంప్లెక్స్లను మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.