ఆగమశాస్త్ర పద్ధతిలోనే ఆలయ అభివృద్ధి పనులు జరగాలి !

👉 ధర్మపురి క్షేత్రానికి మహర్దశ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

వందలాది సంవత్సరాలు చరిత్ర గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయా అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికుల, భక్తులు మనోభావాలకు అనుగుణంగా  పునర్నిర్మాణ పనులు చేపట్టాలి అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులకు సూచనలు చేశారు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు, భక్తుల సౌకర్యాలు  గోదావరినది స్నానము చేయు భక్తులకు వసతుల కల్పన మాస్టర్ ప్లాన్ అమలు వివిధ అభివృద్ధి పనుల గూర్చి సోమవారం హైదరాబాద్ దేవాదాయశా నుండి పనుల పరిశీలన కోసం  వచ్చిన  స్థపతి, సూపరింటెండెంట్ ఇంజనీయర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీయర్, అర్కిటెక్ట్ డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీయర్, ఇతర అధికారులు మంత్రి  క్యాంప్ కార్యాలయంలో నమూనా ప్లాన్ ను అధికారు లు మంత్రికి వివరించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ..

ఇక్కడ కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, ఋషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టండి మంత్రి అన్నారు.
మీరు వివరించిన విధంగా ఉగ్ర నరసింహ స్వామి ఆలయం యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మాణం కు సంబంధించిన డి పి ఆర్ ( డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ) ఇవ్వండి, పరిపాలన అనుమతుల నిధులు మంజూరు  చేయిస్తా అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 క్రమ పద్ధతిలో పనులు చేయండి !

అభివృద్ధి పనులు క్రమ పద్ధతిలో చేపట్టండి, మీరు చెప్పిన విధంగా ముందుగా ఉగ్ర నరసింహ స్వామి ఆలయం పనులు సకాలంలో పూర్తిచేసి, మిగతా అభివృద్ధి పనులు చేపట్టండి అన్ని పనులు  ఓకే సారీ మొదలుపెట్టి  పెండింగ్ పెట్టవద్దని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.


అధికారుల సమక్షంలోనే దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారిని  రామ శైలజ అయ్యంగారితో ఫోన్ లో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, క్షేత్రాన్ని సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో స్థపతి వల్లి నాయగం , సూపరింటెండెంట్ ఇంజనీయర్  ఓంప్రకాష్ రావు , ఎక్జిక్యూటివ్ ఇంజనీయర్,  శ్రీనివాస శర్మ, అర్కిటెక్ట్ శరయ, ధర్మపురి ఆలయ ఇంచార్జి ఎక్జిక్యూటివ్ ఇంజనీయర్  టి.రాజేష్, డిప్యూటి ఎక్జిక్యూటివ్ ఇంజనీయర్  ఎమ్. రఘునందన్, అసిస్టెంట్ ఇంజనీయర్ ఎస్.ప్రతాప్, కార్యనిర్వహణాధికారి  సంకటాల శ్రీనివాస్, ఆలయ పాలకవర్గ చైర్మెన్  జక్కు రవీందర్, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.