అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J SURENDER KUMAR,


లష్కర్ బోనాల సందర్భంగా ఆదివారం
ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు
.


హైదరాబాద్ లోని మొగలపుర జగదాంబ అమ్మవారి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయం, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాలను మంత్రి లక్ష్మణ్ కుమార్  సందర్శించి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను సమర్పించారు.


ఆలయల  అర్చకులు, నిర్వాహకులు, పాలకవర్గ సభ్యులు, అధికార యంత్రాంగం మంత్రికి ఘనంగా స్వాగతించారు. సకాలంలో వర్షం రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
ఆలయాల అర్చకులు అధికారుల అమ్మవారి తీర్థ ప్రసాదాలను మంత్రి అందజేసి ఘనంగా ఆశీర్వదించి అమ్మవారి శేష వస్త్రంతో  సన్మానించారు.