👉 మంత్రి అడ్లూరి చాంబర్ లో ఆశ్చర్యకర సన్నివేశం !
J SURENDER KUMAR,
అర్ధాంతరంగా వచ్చిపోయే పదవులను అడ్డుపెట్టుకొని కొందరు చోట, మోట ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులపై, అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిడి చలాయించే తీరు తెలిసిందే.
👉 ఇది ఇలా ఉండగ
ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి గత సంఘటనలు, సందర్భాలు మరచి రాగద్వేషాల కతీతంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం ఆ అధికారులతో కలసి సమీక్షిస్తున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే…
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారిక చాంబర్ లో గురువారం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి, డాక్టర్ శరత్, పూల బోకెను మంత్రి లక్ష్మణ్ కుమార్ అందించి శుభాకాంక్షలు తెలిపిన ఆశ్చర్యకరమైన సన్నివేశం నెలకొంది.

వివరాల కోసం ఏడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు పరిశీలిస్తే ఆశ్చర్యకర సన్నివేశమే అనిపిస్తుంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ , నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ అధినేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై తన గెలుపు ఓటములను తారుమారు చేశారని ఆరోపణలు చేయడమే కాకుండా తన ఓటమి ప్రకటనలో అక్రమాలు జరిగాయి అంటూ నాటి జగిత్యాల కలెక్టర్ , జిల్లాఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ ఏ శరత్ పై. మంత్రి లక్ష్మణ్ కుమార్ పలుసందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఆరోపించడమే కాదు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కారు. EVM మిషన్ లు వివి ప్యాడ్స్ , సి సి ఫుటేజ్ లు తదితర అంశాలపై న్యాయస్థానంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి విచారణ చేయించారు.
జగిత్యాల్ జిల్లా కలెక్టర్ గా నాడు పనిచేసిన డాక్టర్ శరత్, పాలన తీరులో ప్రత్యేక గుర్తింపు పొందడంతో పాటు పదవ తరగతి ఫలితాలలో జిల్లాను రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిపారు. నూతన జిల్లాగా ఆవిర్భవించడంతో అభివృద్ధి అంశాలలో కలెక్టర్ శరత్ తీరును నేటికీ ప్రజలు చర్చించుకుంటారు.
విచారణ జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రకటన రావడం మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేగా విజయం సాధించి క్యాబినెట్ మంత్రి హోదాలో కొనసాగుతున్నారు.
👉 ప్రతికార రాజకీయాలు పక్కనపెట్టి…
మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన, విప్ పదోన్నతి పొంది దాదాపు సంవత్సరకాలం పాటు స్థానిక సంస్థలు పవర్ లో కొనసాగాయి. సర్పంచులు ఎన్నికల్లో తనను వ్యతిరేకించిన నాటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై అవిశ్వాస తీర్మానాలు, చెక్ పవర్ రద్దు , సస్పెండ్ చేయించడం, అధికార యంత్రాంగంలోనూ బదిలీలు, సస్పెన్షన్ ల ప్రతికార రాజకీయాల ఆరోపణలు మంత్రి లక్ష్మణ్ కుమార్ పై ప్రస్తుతానికి లేవు.