అంతర్జాతీయ క్రీడలు తెలంగాణలో నిర్వహణకు అవకాశం ఇవ్వండి !

👉 కేంద్ర క్రీడల శాఖ మంత్రి  సుఖ్ మాండవీయ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !

J.SURENDER KUMAR ,

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఏవైనా తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి  సుఖ్ మాండవీయ ని కోరారు. సోమవారం ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.


👉 ప్రధానంగా ఖేలో ఇండియా గేమ్స్, 40వ జాతీయ క్రీడలు, లేదా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.


👉 అలాగే, ఖేలో ఇండియా ప‌థ‌కం కింద క్రీడాకారుల శిక్ష‌ణ‌, క్రీడా వ‌స‌తుల అభివృద్ధికి నిధులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. జాతీయ క్రీడ‌ల్లో పాల్గొనే క్రీడాకారుల‌కు గ‌తంలో మాదిరే రైలు ప్ర‌యాణ ఛార్జీల్లో రాయితీ క‌ల్పించాల‌ని విన్నవించారు.


👉 కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రి తో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి , చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి  ఉన్నారు.