ఏపీ డిజిపి  ముందు లొంగిన సీనియర్ మావోయిస్టులు !

J.SURENDER KUMAR,

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  హరీష్ కుమార్ గుప్తా, ముందు శనివారం జోరిగే నాగరాజు @ కమలేష్, ఆయన భార్య, జ్యోతిశ్వరి @ అరుణ లొంగిపోయారు.


👉 మీడియా సమావేశంలో డిజిపి తెలిపిన వివరాలిలా ఇలా ఉన్నాయి !


జోరిగే నాగరాజు @ కమలేష్, రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు (SZCM) &  ఇంచార్జ్ తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీ (DVC), కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, పోరంకి  గ్రామం. ఇతడు మావోయిస్టు పార్టీలో 34 సంవత్సరాలగా అజ్ఞాతం కొనసాగుతున్నారు.  ఆయన భార్య మెదక్ జ్యోతిశ్వరి @ అరుణ, డివిజనల్ కమిటీ సభ్యురాలు (DVCM) &  ఇంచార్జ్ మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్ (MAPOS), తూర్పు బస్తర్, కప్పలదొడ్డి గ్రామం మండలం గూడూరు కృష్ణా జిల్లాకు చెందినవారు, దాదాపు 30 సంవత్సరాలు గా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు.


కమలేష్, SZCM ర్యాంక్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) తూర్పు బస్తర్ DVCలో ఇంచార్జ్ గా పనిచేశారు, మావోయిస్టు పార్టీ వైఫల్యాలు మరియు కేంద్ర కమిటీ విధానాలతో నిరాశ చెందారు. మావోయిస్టు భావజాలం క్షీణిస్తోందని ఆయన అర్థం చేసుకున్నారు.

ఆయన భార్య అరుణ MAPOS (మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్)లో ఇన్చార్ గా పనిచేశారు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ విధానాల వైఫల్యాలతో కూడా నిరాశ చెందారు.
లొంగిన మావోయిస్టు దంపతులకు తక్షణ సహాయం కోసం డిజిపి ఒక్కొక్కరికి ₹ 20,000/- విలువైన చెక్కులను అందించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆపరేషనల్ పార్టీల గాలింపులో పట్టుబడిన ఆయుధాలను అధికారులు మీడియా సమావేశంలో ప్రదర్శించారు.


ఈ ఆయుధాలలో ఒక AK 47, 2 BGL లు, 5 SLR లు, 2 INSAS రైఫిల్స్, 606 లైవ్ మందుగుండు సామగ్రి, 37 కిలోల కార్డెక్స్ వైర్ మరియు ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా స్వాధీనం చేసుకున్న ఇతర పరికరాలు ఉన్నాయి.


13 మంది UG కేడర్‌కు  ₹ 22 లక్షల చెక్కులను అందజేశారు, వీరిలో ఇటీవల AP పోలీసుల ముందు లొంగిపోయిన డివిజనల్ కమిటీ సభ్యుడు మడకం దేవ @ భగత్ ఉన్నారు.  గత ఒక సంవత్సరంలో, ఏపీ పోలీసుల ముందు లొంగిపోయిన వివిధ హోదాలకు చెందిన 48 మంది కేడర్లకు ₹ 64 లక్షల నగదు అందించినట్టు డిజిపి తెలిపారు.


గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 5 కాల్పుల సంఘటనలు జరిగాయని, ఉదయ్ (కేంద్ర కమిటీ సభ్యుడు), అరుణ & జగన్ (రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యులు), రమేష్ (డివిజనల్ కమిటీ కార్యదర్శి) సహా 6 మందిని మట్టుబెట్టి 8 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఏడుగురిని అరెస్టు  40 మంది యుజి కేడర్‌ లొంగినట్టు డిజిపి హరీష్ కుమార్ గుప్తా, తెలిపారు.

అరెస్టు అయిన 7 మందిలో ఒకరు డివిజనల్ కమిటీ కార్యదర్శి, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు మరియు ముగ్గురు యాక్షన్ టీమ్ సభ్యులు. లొంగిపోయిన 40 మందిలో ఇద్దరు డివిజనల్ కమిటీ కార్యదర్శులు మరియు 15 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. అని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లొంగుబాటు & పునరావాస విధానం ప్రకారం ఏపీ పోలీసులు  లొంగుబాటుకు వీలు కల్పిస్తారు. వారి పేరు మీద రివార్డు, ఇంటి స్థలం మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని డిజిపి వివరించారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు SZCMలతో సహా  20 మంది కేడర్లు ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లో CPI (మావోయిస్ట్)లో కొనసాగుతున్నారు అని తెలిపారు.


ఈ సమావేశంలో,  శ్రీకాంత్,  (ఐజీపీ, ఆపరేషన్స్),  ఎస్.వి.రాజశేఖర్ బాబు, (సీపీ ఎన్టీఆర్ విజయవాడ),  పి.హెచ్.డి. రామకృష్ణ, (ఐజీపీ ఇంటెలిజెన్స్),  గోపీనాథ్ జట్టి,  (డిఐజీ విశాఖపట్నం రేంజ్), పోలీసు సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.