6 నెలలో ఏసీబీ దాడులు 80 మంది ఉద్యోగులు అరెస్ట్ !


👉 అవినీతి  అంశాలలో మరో 46 కేసులు నమోదు !

👉 మొత్తం కేసుల సంఖ్య 126 ..

J.SURENDER KUMAR,

జనవరి-2025 నుండి జూన్-2025 వరకు, రాష్ట్ర అవినీతి శాఖ అధికారుల దాడులు చేసి 126 కేసులను నమోదు చేసింది.

,లంచం తీసుకుంటూ  80 మంది ఉద్యోగులను  ట్రాప్ చేసి అరెస్టు చేశారు.   ,8 ఆదాయానికి మించిన ఆస్తులు  కేసులు, 14 క్రిమినల్  కేసులు, 10 కేసులు నిత్య విచారణ , 11 కేసులు ఆకస్మిక తనిఖీలు మరియు 3 కేసులో ఎంక్వైరీలు, చేశారు.


8 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా 125 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఏసీబీ పత్రికా ప్రకటన!


ట్రాప్ కేసుల్లో ₹ 24,57,000/- స్వాధీనం చేసుకున్నారు.   వివిధ విభాగాల కేసులలో  ₹ 27,66,60,526/- విలువైన ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించి విచారణ మొదలుపెట్టారు.