బాలిక పై  అత్యాచారం  కేసులలో 20  సంవత్సరాల జైలు శిక్ష !

👉 బాధిత  బాలికకు 2 లక్షల రూపాయలు పరిహారం !

👉 సంచలన తీర్పు ప్రకటించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సి. రత్న పద్మావతి !

J.SURENDER KUMARo

జగిత్యాల జిల్లా మల్లాపూర్  పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్ బాలిక పై అత్యాచార నిందితుడు మర్రిపెల్లి  సాయినాథ్ (24 ) కు జిల్లా ప్రిన్సిపల్ స్టేషన్ జడ్జి శ్రీమతి రత్న పద్మావతి, మంగళవారం  నిందితుడికి 20  సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ₹ 2000 రూపాయల జరిమాన విధించారు.మరియు బాధిత  మైనర్ బాలికలకు ₹ 2 లక్షల రూపాయలు పరిహారం  ప్రకటిస్తూ తీర్పునిచ్చారు.

అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద  2021 ఏప్రిల్ 7 న మల్లాపూర్  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును ఇన్స్పెక్టర్ శ్రీను, ఎస్.ఐ రవీందర్  లు దర్యాప్తు చేసి కోర్టు  కి ఆధారాలు సమర్పించారు.పిపి  కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.

👉 చట్టం నుంచి తప్పించుకోలేరు ఎస్పీ అశోక్ కుమార్ !

ఈ సందర్బంగ ఎస్పి అశోక్ కుమార్,  మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు  శిక్ష నుండి తప్పించు కోలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్  వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ  జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని అన్నారు. పై కేసు లో నిందితునికి  శిక్ష పడటంలో కృషి చేసిన స్పెషల్ పీ.పీ రామకృష్ణ  రావు, ఇన్స్పెక్టర్ శ్రీను,ఎస్.ఐ రవీందర్ , CMS  ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ రంజిత్   మరియు CMS కానిస్టేబుల్స్ రాజు, శ్రీధర్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  ప్రత్యేకంగా  అభినందించారు.