బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం గూర్చి ఆలోచించలేదు!

👉 నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమం గూర్చి ఆలోచించలేదు,  తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం తో  పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం  రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్, MLC శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు జమున మాధవ రెడ్డి, సంజీవ రెడ్డి , PACS చైర్మన్ కొండ శ్రీశైలం,, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తాసిల్దార్, మండల అభివృద్ధి అధికారి లతోపాటు ఇతర ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

మా కాంగ్రెస్ ప్రజా  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 5,28,153 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో పేదలకి మద్దతుగా రేషన్ కార్డులు అందజేయడం గర్వంగా ఉందని భవిష్యత్తులో కూడా పేదల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తాం,” అని మంత్రి అన్నారు.

దేవరకొండ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి లక్ష్మణ్ కుమార్  చింతపల్లి మండలంలోని సాయిబాబా ఆలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు  ఘన స్వాగతం పలికారు..ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందించారు.


ఈ పర్యటనలో దేవరకొండ మున్సిపాలిటీ అభివృద్ధి నిధుల ద్వారా ,₹ 1.35 కోట్లు వ్యయంతో నిర్మించనున్న CC రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి పేదల  సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని మంత్రి వివరించారు.  ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతులకు 9 రోజుల్లో ₹ 9 వేల కోట్లు రైతు భరోసా కింద నిధుల విడుదల, 3,500 ఇళ్లకు ఇందిరమ్మ పథకం మంజూరు, సబ్సిడీ బియ్యం పంపిణీ  వంటివి ఉదాహరణగా పేర్కొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్  చేసిన అభ్యర్థన మేరకు SC, ST కాలనీల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన విషయాన్ని సానుకూలంగా మంత్రి స్పందించి త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంత్రి  లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.