👉 నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత పది సంవత్సరాల బీఆర్ఎస్ రాచరిక పాలనలో మేమే రాజులము, మేమే చక్రవర్తులం అంటూ 2014 – 2018 – 2023 వరకు పాలన చేసిన కెసిఆర్ హాయంలో పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా ? అంటూ నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మరియు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పాల్గొని స్వాగతోపన్యాసం చేశారు

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహిస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా సంతోషంగా ఉందని, గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ రాచరిక పాలనలో పేదలకు రేషన్ కార్డులను పంపిణీ చేయాలన్న ఆలోచన కూడా పాలకులు చెయ్యలేదని, మంత్రి ఆరోపించారు.
ప్రతి సంక్షేమ పథకానికి, ఉద్యోగానికి, విదేశాలకు వెళ్లడానికి, పాస్పోర్ట్ పొందడానికి, ఇంటిలో కొడుకు పెళ్లికి తదితర అవసరాలకు రేషన్ కార్డు కీలకమని మంత్రి అన్నారు.
రేషన్ కార్డు ఆవశ్యకతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందని, రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రిగా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

అదే విధంగా బీసీ వర్గాల కు మేలు జరిగే విధంగా 42 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడానికి కల్పించడం సంతోషదాయకమన్నారు. 30 సంవత్సరాలగా నలుగుతున్న ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించి చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
పెద్ద ఎత్తున పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా లోకం అండగా ఉండాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ మహిళలకు విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి లక్ష్మణ్ కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు ఘనంగా స్వాగతించారు.