బుద్ధవనం ప్రాజెక్టు అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య !

J.SURENDER KUMAR,

బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం (సోమవారం) జూన్ 30న జీవో నంబర్ 197, ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు సంవత్సరాల కాలం పాటు మల్లెపల్లి లక్ష్మయ్య ప్రత్యేక అధికారిగా కొనసాగుతారని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రాజన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

2016 నుంచి 2024 వరకు ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారిగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగిన లక్ష్మయ్య పనితీరు, వృత్తినిబద్ధత,పరిగణంలోకి తీసుకొని తెలంగాణ పర్యాటక అభివృద్ధిని బలోపేతం చేస్తుంది” ఈ ప్రాజెక్టు అభివృద్ధి మరియు ప్రధాన పర్యాటక కేంద్రంగా పరిణామం చెందడంలో లక్ష్మయ్య పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వ ఉత్తర్వులు!

👉 బుద్ధవనం అభివృద్ధి పనితీరుకు అవార్డు !

2016 నుండి 2024 వరకు బుద్ధ వనం ప్రాజెక్టు అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య కొనసాగిన కాలంలో జరిగిన అభివృద్ధి ప్రపంచ స్థాయిలో  గొప్ప పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆయనకు  అవార్డు ప్రధానం చేసి  సన్మానించారు

నాగ్‌పూర్‌లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనం 2025లో ‘బుద్ధవనం’ ప్రత్యేక అధికారి మరియు ప్రముఖ పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అవార్డుతో సత్కరించారు.

నాగార్జునసాగర్ సమీపంలోని 273 ఎకరాల బౌద్ధ వారసత్వ ప్రదేశం ‘బుద్ధవనం’ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా బౌద్ధ వారసత్వం మరియు పర్యాటక రంగానికి ఆయన చేసిన కృషికి గాను శాలువా, పుష్పగుచ్ఛం, ప్రశంసా పత్రం మరియు ప్రత్యేక గౌరవంతో సత్కరించారు.
ఈ అవార్డును భంటే మొక్ఖాచార (ఇండోనేషియా) మరియు అమన్ కాంబ్లే ప్రదానం చేశారు.