సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏదో  చేయాలని తపన ఉన్న నాయకుడు !

👉 ఐటి పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,


సీఎం రేవంత్ రెడ్డి మంచి నాయకుడు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపనతో ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి తరువాత మరొకటి పూరించే కార్యక్రమంతో పాటు తెలంగాణాను అభివృద్ధి చేయాలని, హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం ఉంది ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి  శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తన అభిప్రాయం వెల్లడించారు.


పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు( Podcast With NTV Telugu)లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని  ప్రకటించినప్పుడు తాము తీసుకున్న నిర్ణయాలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

👉 మంత్రి శ్రీధర్ బాబు మాటల్లోనే..

కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు మేము అందరం నడుస్తాం. ఆ క్రమంలో ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పక్ష నేతగా రేవంత్ రెడ్డిని నిర్ణయించినప్పుడు అందరం కలిసి పని చేయాలని ఆ నాయకుడికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆలోచించాం అందరం కలిసి ముందుకు వెళ్తున్నాం.

సీఎం రేవంత్ రెడ్డి లక్ష్య సాధనలో అనేక పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము కూడా బాధ్యతతో పని చేస్తున్నాం. గత ఏడాదిన్నర కాలంలో దగ్గరగా ఉండి చూస్తున్నాం. ఒక బలమైన, లక్ష్యమున్న నాయకుడి లక్షణాలు సీఎం రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్నాయి. అధిష్టానం అన్ని బేరీజు చేసుకుని ఓ మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను నమ్ముతున్నా. ప్రజలకు ఆశించిన మేలు జరుగుతలేదు అనే తపన సీఎం రేవంత్ రెడ్డి లో  కనిపించింది.

ఒక లక్ష్యం ఉంది. ఒక ఆలోచన ఉంది. అనేక సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ లక్ష్యాన్ని చేరాలని పట్టుదల ఉన్న వ్యక్తిగా కనిపించారు.


దీనికి తోడు అతడి ప్రణాళికలు, సమయం, సందర్భం అన్ని  కలిసి వచ్చింది. కేంద్రంలో ఉన్న పార్టీ పెద్దలతో కూడా కలిసి నడిచారు. వారు సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాలకు అనుగుణంగా మేము నడుస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.