కాంగ్రెస్ ప్రభుత్వమే మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడుతుంది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

కాంగ్రెస్ ప్రభుత్వమే మైనారిటీల సంక్షేమం కోసం అనేక చట్టాలు తెచ్చిందని. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిందని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెద్దపల్లి కేంద్రంలో సోమవారం రాత్రి  మైనార్టీల ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మైనారిటీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.