👉 వెల్గటూర్ గోదావరి నుంచి అదనపు టిఎంసి నీళ్లు ఎక్కడికి పోతున్నాయి ?
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
సాగునీటి విషయంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడడం సరికాదని, వెల్గటూర్ గోదావరి నుంచి అదనపు టిఎంసి నీళ్లు ఎక్కడికి పోతున్నాయి ? మీ ప్రభుత్వంలో పనులు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించలేని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సాగునీటి గూర్చి మాట్లాడడం సిగ్గుచేటు అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ధర్మపురి పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో శనివారం మీడియా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ సాగునీటి అంశంపై ప్రభుత్వంపై చేసిన ఆరోపణలో గూర్చి మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందన ఏమిటి అని అడిగారు.
👉 పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మేమే రాజులం చక్రవర్తులం అన్నారు కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి ఏమి చేశారో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
👉 కాళేశ్వరం అదనపు టీఏంసి పేరుతో వెలగటూరు మండల పరిసర ప్రాంతాల రైతాంగం నుంచి వెయ్యి ఎకరాల భూములను లాక్కొని మేఘా కంపెనీకి అప్పజెప్పిన ఘనత కొప్పుల ఈశ్వర్ ది అన్నారు. ఆ నీటితో రంగదామని చెరువు, జంగనాల ప్రాజెక్టు, అక్క పెళ్లి చెరువు కు తదితర ఇతర చెరువులకైనా వీటిని అనుసంధానం చేశాడా అని మంత్రి ప్రశ్నించారు.
👉 గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గి లిఫ్ట్ ల ద్వారా సాగు చేసుకుంటున్న రైతాంగం పంట పొలాలు పొట్ట దశలో ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించి దొంతాపూర్, జైన, రాజారం , ధమ్మన్నపేట రైతాంగానికి సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఎక్కడో డబ్బా గ్రామంలో తాగునీటి రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడనుండి మోటార్ల ద్వారా పైపులైన్ల ద్వారా ధర్మపురికి సక్రమంగా వచ్చాయా ? అనే మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, రైతా గానికి, భవిష్యత్తులో తాగు సాగు నీటి సమస్యలు ఉండవని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.