ధర్మపురి ఆలయంలో ఉచిత అన్నదాన భక్తుల సంఖ్య పెంపు !

👉 మంగళ, శని, ఆదివారలలో 500 మందికి !

👉 సోమ,బుధ,గురు,శుక్రవారలలో 300 మందికి !

👉మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో..!

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానములో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు ఉచిత అన్న ప్రసాద భక్తుల సంఖ్యను మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో పెంచినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.


ప్రస్తుతం ప్రతి సోమ, బుధ, గురు, శుక్రవారములలో 200 మందికి, ప్రతి మంగళ, శని, ఆదివారములలో 300 మంది భక్తులకు ఉచిత అన్నదానము కొనసాగుతున్నది.


  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సూచనలతో కమీషనర్, దేవాదాయశాఖ, ఉత్తర్వుల ప్రకారం  నుండి పెంపుదలకు శ్రీకారం చుట్టారు. శనివారం నుండి  ప్రతి సోమ, బుధ, గురు, శుక్రవారములలో 200 నుండి 300 మందికి,  ప్రతి మంగళ, శని, ఆదివారములలో 300 నుండి 500 మంది భక్తులకు ఉచిత అన్నదానం కొనసాగనున్నది.


దీంతోపాటు దేవాలయమునకు వచ్చు భక్తుల సౌకర్యార్థం మరియు స్వామి వారి దర్శనమునకు వచ్చు వి.ఐ.పిలకు సులభతరముగా దర్శనము చేసుకునే విధంగా దేవాలయం ముందు విచారణ కౌంటర్ ఏర్పాటు చేయడమైనది. ఇట్టి కౌంటర్ లో వి.ఐ.పిలు ఇతర ముఖ్యమైన భక్తులు సంప్రదించినట్లయితే ప్రత్యేక దర్శనం టిక్కెట్ ఇచ్చి అక్కడ ఉన్న సిబ్బంది వారికి తొందరగా దర్శనం చేసుకొనుటకు తగు ఏర్పాట్లు చేశామని ఈ విచారణ కౌంటర్  నేడు ప్రారంభించినట్టు ఈవో తెలిపారు.