J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.

శనివారం ధర్మపురి మండలం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన, ఆలయ భూ సేకరణ, విస్తరణ భూములు, మరియు ఇండ్లు స్థలాలను పరిశీలించి, పనులను వేగవంతంగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ ధర్మపురి దేవస్థానం ఈవో శ్రీనివాస్ ఆర్ అండ్ బి. ఈ ఈ శ్రీనివాస్ మండల ఇంచార్జ్ తాసిల్దార్ సుమన్, స్థానిక మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు