ధర్మపురి పట్టణంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన !

J . SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కలెక్టర్ ధర్మపురి పట్టణంలో శనివారం జగిత్యాల జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్ అభివృద్ధి పనులు పరిశీలిస్తూ సుడిగాలి పర్యటన చేశారు.

పట్టణంలో ప్రభుత్వ ఉన్నతపాఠశాలను పరిశీలించి, ప్రమాదకర శిథిలవస్తులో ఉన్న ఆరు గదులను తక్షణం కూల్చివేయాలని మున్సిపల్, ఆర్ అండ్ బి  అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

👉 శానిటేషన్:-

సానిటేషన్ అంశంపై అధికారులను  డ్రైనేజీ, కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి పరిశుభ్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  రానున్న రోజుల్లో భారీ వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉండటంతో గోదావరి తీర లోతట్టు  ప్రాంతాలను పరిశీలించి,  ప్రజలను అప్రమత్తం ఉండాలని ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
👉 ఇందిరమ్మ ఇండ్లు :

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను నిర్మాణాన్ని వేగవంతం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

👉 వన మహోత్సవం :

ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొని  కలెక్టర్ సత్యప్రసాద్.
మాట్లాడుతూ చెట్లు నాటడం ఎంత ముఖ్యమో మన అందరి బాధ్యత అని అన్నారు.

ధర్మపురి కేంద్రంలో స్వయం ఉపాధితో అగరత్తులు తయారు చేస్తున్న వారిని కలసి, తయారీ విధానాల తీరు అడిగి తెలుసుకున్నారు. వారిని ప్రోత్సహిస్తూ మరింత పరిమాణంలో ఉత్పత్తి చేసి మార్కెట్‌లో నిలువబెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్ ,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.