J.SURENDER KUMAR,
ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా చీపిరిశెట్టి రాజేష్ ఎన్నికయ్యారు. స్థానిక మున్నూరుకాపు సంఘ భవనంలో ఆదివారం పోటా పోటీగా ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల అధికారులు పకడ్బందీగా ఎలాంటి విమర్శలు గురికాకుండా ఎన్నికలు నిర్వహించారు. చీపిరిశెట్టి రాజేష్, తన సమీప ప్రత్యర్థి లసెట్టి మహేష్ పై 51 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి చెరుకు రాజన్న ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శిగా బండి మహేష్, ఉపాధ్యక్షులుగా చల్ల రవి, ముత్తినేని లక్ష్మణ్, కోశాధికారిగా బుక మహేష్, కార్యదర్శులుగా పానుగంటి రవి, బుక శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా సంగి రాజన్న, బుట్టి మహేష్, మరో 15 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. అనంతరం విజేతలు పట్టణంలో బాణాసంచా కాలుస్తూ, ఊరేగింపు నిర్వహించారు.