ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు!

J SURENDER KUMAR,

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ప్రధాన ఆలయముతో పాటు అనుబంధ ఆలయము అయిన శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయములో  ఈనెల 25  నుండి  ఆగస్టు23 వరకు శ్రావణమాసోత్సవం వైభవముగా జరగనున్నది.

👉 శ్రావణమాసం సందర్భముగా ప్రతి సంవత్సరం వలె ప్రధాన ఆలయములో శ్రీస్వామి వారికి నెల రోజులు ప్రత్యేక అభిషేకంలు. ప్రత్యేక పూజలు ₹ 2516/-లు చెల్లించిన భక్తుల పేరిట నెల రోజుల పాటు అభిషేకము, పూజలు, సంకల్పము నిర్వహించబడును. ( ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అభిషేకం )

👉 అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్రనర్సింహస్వామి వారి ఆలయములో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక భోగములు జరుగును. ₹ 2000/-లు చెల్లించిన భక్తుల పేరిట నెల రోజుల పాటు అభిషేకము, భోగములు, సంకల్పము నిర్వహించబడును.

👉 అనుబంధ ఆలయమైన శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయము (శివాలయం)లో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక భోగములు జరుగును. ₹1000/-లు చెల్లించిన భక్తుల పేరిట నెల రోజుల పాటు “అభిషేకము మరియు అన్నపూజ” నిర్వహించబడును.

👉 ప్రతి సంవత్సరము వలె స్థానిక ఆర్యవైశ్య సంఘం, ధర్మపురి వారిచే రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీ ఉగ్రనర్సింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం వలె భజన కార్యక్రమం నిర్వహించబడును.

👉 రేపు ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం !

శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానమునకు సంబందించిన SDF నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  శుక్రవారం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ బి సత్య ప్రసాద్ పాల్గొంటారని ఆలయ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.


👉 ₹ 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ (కె.ఎన్.ఆర్. ధర్మశాల) గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించిన 8 షాపులు !


👉 ₹ 12 లక్షల వ్యయంతో శ్రీ నాగమయ్య పునర్నిర్మాణం చేసిన దేవాలయ ప్రారంభము !


👉 ₹ 15 లక్షల వ్యయంతో నిర్మించిన పుట్టబంగారం స్థలములో  వేదిక ప్రారంభం !