J.SURENDER KUMAR,
అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రపంచ కప్ ఫైనల్స్‌లో విజయం సాధించి గ్రాండ్‌మాస్టర్‌గా అరుదైన రికార్డును కైవసం చేసుకున్న దివ్య దేశ్‌ముఖ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫిడే ప్రపంచ కప్ ఫైనల్‌లో దేశానికే చెందిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపితో తలపడి టైటిల్ సాధించగా, వీరద్దరూ ఫైనల్స్‌కు చేరడం దేశానికి గర్వకారణమని అన్నారు.
👉 అంతరాజాతీయ చెస్ ఫెడరేషన్‌లో సెమీఫైనల్‌లో ప్రపంచ దిగ్గజాలతో తలపడి ఫైనల్‌కు చేరిన వీరిద్దరూ దేశ ప్రతిష్టను మరింత పెంచారని కొనియాడారు. అవకాశాలు లభిస్తే మహిళలు ఏదైనా సాధిస్తారనడానికి వీరిద్దరూ ఉదాహరణ అని అన్నారు.
👉 ఫిడే మహిళా చెస్ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత క్రీడాకారణి సెమీస్‌కు చేరిన చరిత్ర లేకపోగా ఏకంగా ఇద్దరు క్రీడాకాణిలు ఫైనల్స్‌కు చేరడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.