J.SURENDER KUMAR,
దివ్యాంగుల సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని, పెండింగ్ సమస్యలు, దివ్యాంగులకు మరింత లబ్ధి చేకూర్చే అంశాలపై అధికారులతో చర్చించి కొంత సమయం తీసుకుని ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా బాధ్యత నాది అని
ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో కార్పోరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ శనివారం దివ్యాంగుల సంక్షేమం పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
👉 ఆన్ లైన్ ఫెసిలిటేషిన్ సెంటర్ ప్రారంభం !

హైదరాబాద్ నాంపల్లి లోని హజ్ హౌస్ లో హజ్ యాత్రికుల కొరకు ఉచితంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫెసిలిటేషిన్ సెంటర్ మంత్రి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తో కలిసి ప్రారంభించారు.

👉 ఆధునిక యుగంలో సైన్స్ విద్య కీలకం !

ది ఆల్కెమ్-ఎథికల్ టేల్స్ పుస్తకం ,సైన్స్ విద్య యొక్క పరివర్తన శక్తిని ప్రదర్శిస్తుందని ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని వినియోగించుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ అబిడ్స్ లోని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెమినార్ హాల్ లో ఏర్పాటు చేసిన ది ఆల్కెమ్-ఎథికల్ టేల్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ. . ది ఆల్కెమ్-ఎథికల్ టేల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.