గణేష్ ఉత్సవాలు ఎన్నికలకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి !

👉 జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ !

J.SURENDER KUMAR,

గడిచిన ఆరు నెలల్లో పోలీస్ స్టేషన్ యొక్క పనితీరును, కేసుల పరిశోధనలో సాధించిన పురోగతిని అంచనా వేసుకుంటూ, గణేష్ ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న ఆరు నెలల్లో మరింత దృఢ నిశ్చయతో పోలీసు యంత్రాంగం పనిచేయాలని  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులకు సూచనలు చేశారు.

జగిత్యాల ఎస్పీ కార్యాలయంలో బుధవారం  పోలీస్ అధికారులతో  క్రైమ్ సమావేశం, గణేష్ ఉత్సవాల బందోబస్తు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రశాంతంగా నిర్వహణకు  ఎస్పీ అశోక్ కుమార్ దిశా నిర్దేశం చేశారు.

👉 ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ….

పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పి లు, సి. ఐ లు తమ పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ లలో నమోదైన వివిధ రకాల కేసులు యొక్క స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సంబంధిత ఎస్.ఐలకు కేసుల దర్యాప్తు కు సంభందించి సూచనలు ఇవ్వాలని సూచించారు.

👉  మహిళల భద్రతే లక్ష్యంగా పని చేయాలని మహిళలు చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ,ఎలాంటి దాడులకు పాల్పడిన వారిపై చట్టపరం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు.

👉 రాబోవు రోజులో కురిసే వర్షాల దృష్ట్యా ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలని అన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పర్చాలని సూచించారు.

👉 దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని అన్నారు.

👉 గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి !

వచ్చె నెలలో  ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎస్.ఐ లు, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. మండపాల్లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని ఎస్పి సూచించారు.

👉 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి !

త్వరలో జరగనున్న  స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే తగిన కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాలను ముందస్తు సమాచారం సేకరించి వివాద సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

👉 గత ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదు అయన వ్యక్తులు, భూతగాదాల విషయంలో, పాత కక్షలు మనసులో పెట్టుకుని నేరాలు చేసేవారిని మరియు నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ ల వారిగా గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కొత్తగా రౌడీషీట్స్ ఓపెన్ చేయాలని  అన్నారు. 

👉 అక్రమ వ్యాపారాలు పై నిఘా ఉంచాలి !

జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి పోలీసు అధికారుల సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలు అయిన మట్కా, ఇసుక అక్రమ రవాణా, పేకాట,గుడుంబా, PDS రైస్, వాటి పై నిఘా ఉంచి దాడులు నిర్వహించి అరెస్ట్ చేయాలని సూచించారు.

👉 రోడ్డు ప్రమాదాల నివారణకు  చర్యలు !

జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో  అధికారులతో చర్చించారు.. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాని సంబదిత అధికారులు కలిసి విజిట్ చేయాలనీ, ప్రమాదాల నివారణకు  చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో డిఎస్పీలు వెంకటరమణ, రఘు చంధర్,రాములు, వెంకట రమణ మరియు DCRB,SB, IT CORE ,CCS, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్  రిజర్వ్  ఇనస్పెక్టర్ వేణు  మరియు సి.ఐ లు, సుధాకర్ , కరుణాకర్ ,రామ్ నరసింహారెడ్డి, సురేష్ ,మరియు ఎస్.ఐ లు, DCRB, ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.