గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష !

J SURENDER KUMAR,

రాష్ట్రంలో గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై ఆ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షించారు.


హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్  గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించి చర్చించారు. ప్రస్తుత పరిస్థితులు, అమలులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు, బడ్జెట్ వినియోగం మరియు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.

సంబంధిత అధికారులు  వివిధ పథకాల అమలుపై సమగ్రమైన నివేదికను మంత్రికి సమర్పించారు. గిరిజనుల అభివృద్ధి, విద్యా ,వైద్యం, ఉపాధి, పోడు  తదితర అంశాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు అర్హత ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి చేరాలని మంత్రి అధికారులకు సూచించారు.


గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీటిని మరింత సమర్థవంతంగా అమలుకు అధికారులు కృషి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.