గోదావరిలో పెరగనున్న నీటిమట్టం !

👉 నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత !

J.SURENDER KUMAR

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీరు విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణలో గోదావరి నది నీటిమట్టం మంగళవారం నుండి పెరగనున్నది.


వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళ వారం  తెలంగాణ మహారాష్ట్ర అధికారులు  తెరవనున్నారు
.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జులై 1న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి.. అక్టోబరు 28 వరకు  తెరుస్తారు.
వర్షాకాలం ప్రారంభమై నెల గడిచినా ఇప్పటి వరకు సరైన వానలు కురవలేదు. ఎగు వన కురిసే వర్షాలకు బాబ్లీ నుంచి అయినా వరద శ్రీరామసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)  లోకి వస్తుంది.
.