👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామంలో స్మశాన వాటిక కు రహదారి లేకపోవడం బాధాకరమని, ఇది ప్రజల మౌలిక హక్కులకు వ్యతిరేకమని, ఈ సమస్యను ఇకమీదట ఇలాగే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైన నిధులు మంజూరు చేయించి, త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గొల్లపల్లి మండల కేంద్రంలో స్మశాన వాటికకు సరైన రహదారి లేక గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దారి లేక మట్టిలోనూ, పొలాల్లోనూ మోసుకెళ్లే దుస్థితి నెలకొనగా, ఈ సమస్య పట్ల గత పదేళ్లుగా పాలనలో ఉన్న నేతలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపించారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్, గురువారం స్థానిక ప్రజలతో కలిసి స్మశాన వాటికకు వెళ్లే బురద మాయమైన దారిలో నడిచి పరిస్థితి పరిశీలించారు. స్మశాన వాటిక దారికి యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.