👉 సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపల్స్, జోనల్ అధికారుల, ఒరియంటేషన్ కార్యక్రమంలో…
J.SURENDER KUMAR,
తాను కూడా సామాన్య కుటుంబం కు చెందిన వాడిని, గురుకులాల్లోనే చదువుకున్న విద్యార్థినే, బాధ్యతలు తెలిసినవాడిని, విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పని చేస్తున్న జోనల్ అధికారులు, ప్రిన్సిపల్స్ తో హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD ) లో బుధవారం ఒరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.
👉 సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మొదటిసారి ఓరియంటేషన్ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులతో సమస్యలు, పరిష్కార మార్గాల పై సమీక్షించారు. అధికారులను నిస్సంకోచంగా సమస్యలు చెప్పండి, పరిష్కారానికి సూచనలు ఇవ్వండి, అని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

👉 ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు TGSWREIS – WWF ఇండియాల మధ్య ‘మిషన్ ప్రకృతి’ పై (MOU) జరిగింది. ఈ సంస్థ చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలను, మంత్రి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. WWF నిర్వాహకులు, అనిల్ కుమార్ శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఈ ఒప్పందం జరిగింది.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసి, నాణ్యమైన, ఫైన్ రైస్ (సన్నబియ్యం) అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
👉 వసతి గృహాల్లో ఇక నుండి అల్యూమినియం పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రలలో వంట పదార్థాలు వండాలనీ ఆయన ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చుల అంచనాలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.
👉 గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల సమస్యలను పట్టించుకునే నాధుడు లేడని ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ఉద్యోగుల సమస్యలను న్యాయపరంగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది,” అని మంత్రి స్పష్టం చేశారు.

👉 ప్రిన్సిపాళ్లకు ఉద్యోగ సర్వీస్ సమస్యకు సంబంధిత అంశాలను, నిబంధనల మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో విద్యార్థులు డార్మెటరీ లో పాఠాలు విని, అక్కడే భోజనాలు చేసిన సంఘటన లు విన్నప్పుడు బాధ కలిగింది అని మంత్రి అన్నారు.
👉 ఇకపై హాస్టళ్లను స్వయంగా పర్యటిస్తానన్నారు. సమస్యలు నేరుగా తెలుసుకుంటాను, విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినాకు ఇప్పటికే సూచనలు చేసినట్లు మంత్రి అన్నరు.
👉 ప్రతి హాస్టల్‌కు 15 రోజులకొకసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య బృందం వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం అని మంత్రి తెలిపారు.
👉 విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్ట్ వారీగా వెనుకబడ్డ వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జోనల్ అధికారులకు, ప్రిన్సిపాళ్లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

👉 డైనింగ్ హాల్స్, మెస్‌లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిధుల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో చర్చించి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
👉 పరకాల డిగ్రీ కళాశాల తాత్కాలిక మరమ్మత్తులకు అవసరమైన నిధులను ఇన్‌చార్జి మంత్రితో చర్చించి కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

👉 గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డైట్ చార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించలేదని తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెస్ , కాస్మెటిక్ చార్జిలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం, షూస్,పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 సర్వీస్ మేటర్, 010 పద్దు వేతనాలు, హెల్త్ కార్డుల పరిష్కారానికి ప్రభుత ముఖ్య కార్యదర్శితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు అందించే మెస్ విషయంలో అందులో జరిగే చిన్నపాటి లోటుపాట్ల పై ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో బురద జల్లినా, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.