గురుకులాల విద్యార్థుల సంక్షేమ బాధ్యత గురువులదే !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

గురుకులాలలో విద్యార్థుల వసతి విద్యా బోధన,
సంక్షేమ బాధ్యతలు ఆయా గురుకులాల్లో విధులు నిర్వహించే గురువులదే బాధ్యత అని ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


రాష్ట్ర సచివాలయంలో సోమవారం  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల ప్రవేశాలు, మరియు సంక్షేమ హాస్టల్లో వసతుల, భోజనం, విద్యా బోధన తదితరు అంశాలపై  ఆయా శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు..


  నేటి బాలలే మన గురుకులాలలో రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని, కాబట్టి విద్యార్థుల విద్యా, సంక్షేమం, వసతుల విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.