గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

ధర్మారం మండలంలోని మల్లపూర్ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖమంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతులు మధ్యాహ్న భోజన సదుపాయం వంటి తదితర అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి  భోజనం చేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..


మల్లపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా దానికి చేశాను విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న వసతులు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు వంటి తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నానని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, బోజన నాణ్యత  పరిశీలన కోసం వారితో కలిసి భోజనం చేసినట్టు మంత్రి తెలిపారు.  పాఠశాలలో కొంత నీటి సమస్య ఉండటంతో ఒక బోర్ వేల్ కావాలని  దృష్టికి ఉపాధ్యాయులు  వివరించారు వెంటనే దాన్ని మంజూరు చేస్తున్నామని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

వర్షాకాలంలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున 15 రోజులకు ఒకసారి జిల్లా వైద్య బృందంతో కలసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కు సూచనలు చేశానన్నారు.   విద్యార్థుల డైనింగ్ హాల్  కొంత చిన్నగా ఉంది చెప్పారని ఈ సమస్యను  వీలైంత త్వరగా  మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.