J.SURENDER KUMAR,
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

రాజ్‌భవన్ దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ ప్రసాద్ కుమార్, ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, నగర ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
